రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు అన్ని పెరిగిపోతూనే ఉన్నాయ్. పెట్రోల్, డీజిల్, తో పాటు కరెంటు బిల్లులు కూడా పెంచడం తెలిసిన విషయమే. వేసవికాలం అవ్వడం తో కరెంటు లేక ఎంతో మంది ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. కరెంటు బిల్లులు పెంచడం ఒక ఎత్తైతే కోతలు మరో ఎత్తుగా భావించవచ్చు. ఎప్పుడు పోటంతో తెలియక ప్రజలు చాల ఇబ్బంది పడుతున్న విషయం పై స్పందించిన ప్రతిపక్షాలు రోజు ఏదో ఒక చోట ధర్నాలు నిర్వహిస్తూనే ఉన్నారు. తాజాగా పెంచిన విద్యుత్ చార్జీలు, విద్యుత్ కోతలు నిరసిస్తూ కాకినాడలో జనసేన ర్యాలీ నిర్వహించింది. తక్షణం కరెంట్ సరఫరా మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంగిశెట్టి అశోక్, శ్రీ వాసిరెడ్డి శివ, శ్రీ తలాటం సత్య, శ్రీ ఆట్ల సత్యనారాయణ, జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.