మత్స్యకార కుటుంబాలకి జగన్ సంవత్సరానికి 10, 000 వేల రూపాయలు ఆర్ధిక సాయంగా ప్రకటించి దానిని అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం మీద వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ... వేట విరామ కాలంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి ఇస్తున్న పది వేల రూపాయల ఆర్థిక సాయం వారి జీవితాలకు భరోసానిస్తోంది. 1.24 లక్షల గంగపుత్రుల కుటుంబాలకు ఆలంబన అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించి రెండు నెలలు సముద్రంలో వేటకు విరామం ఇచ్చి మత్స్య సంపద పునరుత్పత్తికి తోడ్పడాలి అని పిలుపునిచ్చారు.