ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రైవర్‌తో కలిసి భర్త హత్యకు వివాహిత ప్లాన్!

national |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 03:32 PM

ఇటీవల కాలంలో చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. ఇలా జరగడం వెనుక వారి జీవితాల్లోకి మూడో వ్యక్తి రావడమే కారణం. వివాహేతర సంబంధాలు పండంటి కాపురాలను నాశనం చేస్తున్నాయి. దీంతో కలకాలం జీవించాల్సిన ఆలూమగలు మధ్యలోనే విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా డ్రైవర్‌తో సంబంధం పెట్టుకున్న తన భార్య సుపారీ ఇచ్చి తన హత్యకు పాల్పడిందని ఓ వ్యక్తి ఆరోపించాడు. ఈ కేసు విచారణలో పోలీసులకు సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


ఒడిషా రాష్ట్రానికి చెందిన బినాయక్ బెహ్రా అనే ఓ ఇంజినీర్‌కు శిల్సిలా అనే యువతితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. 2020 నుంచి ఈ జంట వేరుగా ఉంటుంది. తన డ్రైవర్‌తో భార్య శిల్సిలా వివాహేతర సంబంధం పెట్టుకుందని బినాయక్ ఆరోపిస్తున్నాడు. అయితే తన భర్తే ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకుని తనను దూరం పెట్టాడని శిల్సిలా చెబుతోంది. ఈ తరుణంలో ఇటీవల బినాయక్‌పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీని వెనుక తన భార్య హస్తం ఉందని బినాయక్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వాస్తవాలపై ఆరా తీశారు.


విచారణలో పోలీసులకు సీసీ టీవీ దృశ్యాలు లభించాయి. డ్రైవర్ అశోక్‌పై పోలీసులకు అనుమానం కలిగి అరెస్ట్ చేశారు. అతడితో పాటు జితేంద్ర అనే కాంట్రాక్ట్ కిల్లర్‌తో కలిసి బినాయక్ బెహ్రాను హత్య చేసేందుకు రూ.లక్షకు సుపారీ ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది. డ్రైవర్ అశోక్ తనకు సోదరుడు లాంటి వాడని శిల్సిలా చెబుతోంది. పోలీసులతో కుమ్మక్కై, తన భర్త తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని పేర్కొంది. అయితే సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులైన డ్రైవర్‌ అశోక్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకోగా, జితేంద్ర కోసం గాలింపు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com