ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాఠశాలలకు సెలవులే..కానీ ఉపాధ్యాయులకు మే 20 వరకు రద్దు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 25, 2022, 05:06 PM

పాఠశాలలకు సెలవులు ప్రకటించిన ఏపీ సర్కార్ ఉపాధ్యాయులకు మాత్రం కొన్ని సెలవులను రద్దుచేసింది. ఏపీలోని పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు సెలవులు ప్రకటించడం తెలిసిందే. అయితే, ఉపాధ్యాయులకు సెలవుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 20వ తేదీ వరకు ఉపాధ్యాయుల సెలవులను రద్దు చేసింది. కేవలం అత్యవసర వైద్య చికిత్సలకు మాత్రమే సెలవులు మంజూరు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో మే 20వ తేదీ తర్వాతే ఉపాధ్యాయులకు సెలవులు అందుబాటులోకి వస్తాయి. జులై 4 నుంచి నూతన విద్యాసంవత్సరం షురూ కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa