ప్రేమను గెలవాలే కానీ దక్కలేదని జీవితంలో ఓడిపోకూడదు. ప్రేమ విఫలమైందన్న కారణంతో యువతి ఇంటిముందు ఓ యువకుడు శరరీంపై పెట్రోల్ పోసుకుని, నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగులో చోటు చేసుకుంది. ఆ గ్రామంలోని తన ప్రేయసి ఇంటిముందుకు పెట్రోలుతో వెళ్లిన యువకుడు నిప్పు అంటించుకోవడం చూసిన స్థానికులు మంటలు ఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. ఆ యువకుడిని చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మృతుడి స్వస్థలం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట అని పోలీసులు గుర్తించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa