ప్రొద్దుటూరు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సోమవారం మెప్మా పరిధిలో డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకి సంబందించిన రూ. 3, 05, 69, 000 ల మెగా చెక్కును ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మిదేవి డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రంగస్వామి, మెప్మా పీడీ రామ్మోహన్ రెడ్ది, మెప్మా అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.