మహారాష్ట్రకు చెందిన ఓ పోలీసు సోషల్ మీడియాలో హీరోగా మారాడు. ఇటీవల ముంబయిలోని జోగిశ్వరి రైల్వే స్టేషన్లో ఊహించని ఘటన జరిగింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. కంపార్టమెంట్ ప్రవేశ ద్వారం వద్ద హ్యాండిల్ పట్టుకుని లోపలికి వెళ్లేందుకు యత్నించింది. ఈ క్రమంలో అదుపుతప్పి రైలకు, ప్లాట్‌ఫాంకు మధ్య పడిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న హోంగార్డు అల్తాఫ్ క్షణాలల్లోనే అప్రమత్తమయ్యాడు. రెప్పపాటులో ప్రాణాలకు తెగించి, ఆ మహిళను కాపాడాడు. అతడి సాహసోపేతమైన చర్యను పోలీసు ఉన్నతాధికారులు ప్రశంసించారు. త్వరలోనే రివార్డు అందించనున్నట్లు ప్రకటించారు. ఈ వీడియోను ఖాలిద్ అనే ఐపీఎస్ అధికారి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో ఆ హోంగార్డును ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.