ఏపీలో పేదలకు వైద్య సౌకర్యాలు అందించడంలో జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని అంటున్నారు తెలుగుదేశం నేత పంతగాని నరసింహ ప్రసాద్. తిరుపతి ఆసుపత్రిలో జరిగిన అమానవీయ ఘటనపై స్పందిస్తూ దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిందే అని డిమాండ్ చేసారు. అసంతృప్తులకి రెండేళ్ళకోసారి బటన్ నొక్కి మంత్రి పదవులు పంచుతాడు. ఏడాదికోసారి జెండా ఊపి ఆంబులెన్స్ లతో వారం రోజులు పరేడ్ చేయిస్తాడు. జగన్ రెడ్డి పాలన అంతా పైన పటారం లోన లొటారం. మూడేళ్ళలో చక్కటి వ్యవస్తలు అన్నింటినీ చిన్నాభిన్నం చేసి పడేసాడు. ఆంబులెన్స్ ఉన్నా కన్న బిడ్డ శవాన్ని ఇలా తెలిసిన వారి బైక్ మీద తీసుకుపోవాల్సిన పరిస్థితి తీసుకువచ్చారు అని తెలియచేసారు.