పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 20వ రోజు నిలకడగా ఉన్నాయి. ఏప్రిల్ 26వ తేదీ మంగళవారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. చివరిసారిగా ఏప్రిల్ 6న లీటరుకు 80 పైసలు పెరిగిన పెట్రోల్ ధర.. మార్చి 22 నుంచి పక్షం రోజుల పాటు స్థిరంగానే ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.96.67గా ఉంది. గురుగ్రామ్‌లో పెట్రోల్ ధర రూ.105.86, డీజిల్ ధర రూ.97.10గా ఉంది.
దేశీయంగా ఇంధన ధరలు స్థిరంగా ఉండడం ఇది వరుసగా 20వ రోజు. దీంతో వాహనదారులకు ఊరట లభించింది. అయితే ఈ నెలలో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.3.6 చొప్పున పెరిగాయి. గత నెలలో ఇంధన ధరలు లీటరుకు రూ.6.4 పెరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో నేటి ధరలు పెట్రోల్ రూ.119.49, డీజిల్ రూ.105.49. విజయవాడలో ఈరోజు లీటర్ పెట్రోల్ ధర రూ.121.44గా ఉంది. డీజిల్ లీటరు ధర రూ.107.04.