అంబులెన్స్ సిబ్బంది నిర్వాకంతో ఓ తండ్రి... తన కుమారుడి మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన తిరుపతిలో జరిగింది. రుయా ఆస్పత్రి పరిధిలో ఉండే అంబులెన్స్ డ్రైవర్లంతా సిండికేట్ గా మారడం వల్లే వల్లే ఈ దుస్థితి తలెత్తింది. మృతదేహాన్ని తరలించేందుకు బాధితుడి కుటంబం పంపిన అంబులెన్స్ కాదని.... తమ వాహనంలోనే, తాము చెప్పిన ధర చెల్లించి తీసుకెళ్లాలని పట్టుపట్టడంతో మనస్తాపం చెందిన బాలుడి తండ్రి చేసేది లేక బైక్ పై మృతదేహాన్ని తరలించారు. ఈ ఘటనపై అంబులెన్స్ సిబ్బంది సహా ఆస్పత్రి అధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..