బొప్పాయి రుచిగా ఉండటమే కాదు.. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయితో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా మహిళలు ఈ పండ్లను తప్పనిసరిగా తినాలి.
- అరుగుదల సమస్యలు ఉన్నవారు బొప్పాయిని తినడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇందులోని పపెయిన్ అనే ఎంజైమ్ అరుగుదల ప్రక్రియను వేగవంతం చేస్తుంది. బొప్పాయిలో పీచు శాతం ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకెళ్లి.. చర్మం నిగారింపుతో కనిపిస్తుంది.
- రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎడిమా వంటి సమస్యలతో బాధపడేవారు బొప్పాయిని ప్రతిరోజు తీసుకోవాలి. ఇందులోని ఎ, సీ విటమిన్లు, కాపర్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం కూడా తగ్గుతుంది.
- గుండె వ్యాధులు ఉన్నవారు బొప్పాయిని తినడం మంచిది. మధుమేహము కూడా అదుపులో ఉంటుంది. అధిక రక్తపోటుని బొప్పాయి అదుపులో ఉంచుతుంది.
- బొప్పాయి ముక్కలను పాలతో కలిపి ఉదయం పూట అల్పాహారంగా తీసుకోవాలి. అలా చేస్తే బాలింతల్లో పాలు పడతాయి. ఇందులోని పోషకాలు నెలసరి క్రమంగా వచ్చేలా చేస్తాయి.
- పచ్చిబొప్పాయిని రుతురోజుల్లో మినహా మిగిలిన సమయంలో తింటే గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది.