కృష్ణా జిల్లా: నాగాయలంక మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం ఉపవాస దీక్షాపరులకు నాగాయలంకలోని పెద్ద మస్జీదులో ఇఫ్తార్ సందర్బంగా విందు, ఖర్జుర పళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది.
కృష్ణా జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వర రావు, నాగాయలంక మండల పార్టీ అధ్యక్షులు చింతా వెంకటేశ్వరరావు, అవనిగడ్డ మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు, మోపిదేవి మండల పార్టీ అధ్యక్షులు పూషడపు రత్నగోపాల్, నాగాయలంక ఎస్సై కుడిపూడి శ్రీనివాస్, ముస్లిం సొదరులతో కలిసి ఇఫ్తార్ ప్రార్ధనలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు ఘోర, సుభాని, అజిమ్, మహ్మద్, సుల్తాన్, బండ్రేడ్డి మల్లిఖార్జున్, బొడ్డు విజయ్, బండ్రేడ్డి కిషోర్, జనసైనికులు పాల్గొన్నారు.