అది ఒక మారుమూల గ్రామం. గ్రామంలో నివసించేది కేవలం 90 కుటుంబాలే అయిన ఇంటికి ఒకరు లేదా ఇద్దరు, ముగ్గురు కూడా దేశ సేవ చేస్తున్నారు అంటే ఆశ్చర్యపోక తప్పదు. ఆ గ్రామంలో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులు కూడా ఉన్నారు. దేశ సేవ చేయడమే కాదు వ్యవసాయంలో కూడా రాణిస్తూ ఆ సైనికులు తమకు తామే సాటి అనిపించుకావటమే కాదు మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం లోని మల్లారెడ్డి పల్లి గ్రామం మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. గ్రామంలో 90 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఈ గ్రామానికి మరో ప్రత్యేకత ఉంది. గ్రామంలో నివసిస్తున్న వారంతా ముస్లింలే కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ప్రపంచ యుద్దాలలో పాల్గొన్న గొప్ప గొప్ప సైనికులు కూడా గ్రామంలో ఉన్నారు. ఎన్నో మెడల్స్ ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినవారు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. దేశ సేవ చేయడమే కాదు తమ సర్వీస్ ముగిసిన అనంతరం గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ వ్యవసాయంలో కూడా రాణిస్తు మిగతా వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నేటికి గ్రామంలో యువకులు దేశ సేవ చేసేందుకే మొదట ఉత్సాహం చూపిస్తుంటారు. మరి ఇలాంటి గ్రామం మిగతా గ్రామాలకు ఆదర్శం కావాలని గ్రామాలలో నివసిస్తున్న యువకులకు ఈ గ్రామ యువకులను ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుందాం.