చిత్తూరు: రామకుప్పం మండలం విజలాపురం గ్రామానికి చెందిన సుబ్బన్న కుమార్తెపై అదే గ్రామానికి చెందిన నారాయణస్వామి రెడ్డి క్షుద్ర పూజల పేరుతో వశపరుచుకుని అత్యాచారం చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఆమెను రోజు అత్యాచారం చేస్తున్నట్లు వివరించారు.
ఆమె ఆరు నెలల గర్భవతి అయ్యిందని, అతనిపై వెంటనే చర్యలు తీసుకుని యువతికి తగిన న్యాయం చేయాలని కలెక్టరేట్ వద్ద బాధితులకు అండగా దళిత సంఘాలతో పాటు సిపిఎం మద్దతు ప్రకటించారు.