కడప జిల్లా రైల్వే కోడూరు నియోజక వర్గం పెనగలూరు మండలం గిరిజన కాలానీకి చెందిన కేశవ అనే 10 ఏళ్ల బాలుడిని తిరుపతి రూయా హాస్పిటల్ లో లివర్ ప్రాబ్లమ్ తో చేర్చారు గత రాత్రి ఆబాలుడు మరణించగా, ప్రైవేట్ అంబులెన్సు వాళ్ళతో కుమ్ముక్కైన ఉచిత అబులెన్సు వాళ్ళు రాకపోతే వాళ్ళడిగిన డబ్బులు కట్టలేక దాదాపు 100 కిలోమీటర్లు కొడుకు శవాన్ని బైక్ మీద తీసుకెళ్లిన కన్న తండ్రి. ఇది ప్రభుత్వ వైఫల్యమే, దీనిపై వైద్యశాఖ మంత్రి విడదల రజని తక్షణమే స్పందించాలి అని జనసేన నాయకులు తాతంసెట్టి నాగేంద్ర డిమాండ్ చేసారు.