ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో వసంతోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 27, 2022, 09:17 AM

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం దిగువ అహోబిల లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఘనంగా వసంతోత్సవ వేడుకలు జరిగాయి. అహోబిలం లోని పుణ్యక్షేత్రమైన నరసింహ స్వామి ఆలయంలో శ్రీదేవి భూదేవి దేవదేవుడికి ప్రధాన అర్చకులు వేణుగోపాలన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూలమాలలతో అలంకరించి సాంప్రదాయబద్దంగా వేదపండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానార్చకులు వేణుగోపాలన్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో స్వామివారికి వసంతోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని అందులో భాగంగా నేటి నుండి నాలుగు రోజులు వసంతోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని ప్రతి రోజు ప్రత్యేక పూజలు గ్రామోత్సవం ఉంటుందని ఆయన తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa