కొడవలూరు మండల కేంద్రంలోని ప్రైడ్ రైస్ దుకాణంలో మంగళవారం గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు బెంబేలెత్తారు. ఈ సంఘటనతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక వాహనం వచ్చేలోపు స్థానికులు మంటలార్పేశారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చిన్నపాటి ఆస్తి నష్టం సంభవించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa