పలమనేరులో పదవతరగతి పరీక్షలు అత్యంత పకడ్బందీగా విద్యార్థులకు అన్ని వసతులను కల్పించి నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం. హరి నారాయణన్ అన్నారు. జిల్లా కలెక్టర్ బుధవారం నాడు జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్ తో కలిసి పలమనేరు పట్టణంలో మొదటిరోజు పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న ప్రభుత్వ బాలికల పాఠశాలలో తనిఖీలు చేశారు.
ఈ సందర్భంగా పరీక్షలు రాస్తున్న విద్యార్థుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. మంచి నీటి వసతి, వైద్య సౌకర్యం ప్రధానంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లును పరిశీలించారు. స్కూల్లో లైటింగ్ సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో జరుగుతున్న పరీక్ష విధానం ను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లా డుతూ విద్యార్థులు ప్రశాంత వాతావ రణం లో పరీక్షలు వ్రాసే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.