మంత్రులు, జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సీఎం జగన్ చెప్పారని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. ‘జులై 8న వైసీపీ ప్లీనరీ ఉంటుంది. మే 10 నుంచి ఎమ్మెల్యేలు ప్రతి నెలా 10 సచివాలయాల పరిధిలో ఇంటింటికీ వెళ్లాలి. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకూ చేరవేయాలి. చంద్రబాబు, కొన్ని మీడియా ఛానళ్ల కుట్రలను పార్టీ పరంగా ఎదుర్కోవాలి’ అని సీఎం సూచించినట్లు చెప్పారు.