ఆడపిల్ల అని తెలిస్తేనే అబార్షన్ చేయించే వాళ్లు, ఆడపిల్లని పురిటిలోనే చంపేసేవాళ్లు పుణెలోని రైతన్నను చూసి నేర్చుకోవాలి. తనకు మనవరాలు పుట్టిందని ఏకంగా హెలికాప్టర్లో ఇంటికి తీసుకొచ్చాడు అజిత్ పాండురంగ్ బాల్వాడ్కర్. ఆ పాపను అమ్మమ్మ వాళ్లింటి నుంచి తీసుకురావడానికి హెలికాప్టర్‌ను బుక్ చేశాడు. తమ కుటుంబంలోకి ఆడపిల్ల రావడం తమకెంతో సంతోషంగా ఉందని, అందుకే ఇలా స్వాగతం పలికినట్లు తెలిపాడు.