తమ నోటీసులపై విచారణకు హాజరుకానందున చంద్రబాబు, బొండా ఉమపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. 'ఈ విషయంలో న్యాయ నిపుణులతో చర్చించి ముందుకెళ్తాం. బాధిత మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో చెప్పేందుకే వారికి నోటీసులు ఇచ్చాం. విజయవాడ GGH వద్ద నైతిక విలువలు లేకుండా ప్రవర్తించారు. అత్యాచార బాధితుల పట్ల ఎలా ఉండాలో వారికి చెప్పాలనుకున్నాం' అని పద్మ చెప్పారు.