దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పతనం నేపథ్యంలో మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 537 పాయింట్లు నష్టపోయి 56,819 వద్ద ముగిసింది. నిఫ్టీ 162 పాయింట్లు నష్టపోయి 17,038 వద్ద కొనసాగుతోంది.
BSE సెన్సెక్స్ టాప్ గెయినర్లు:
టాటా స్టీల్ (1.05%), ఏషియన్ పెయింట్స్ (0.73%), TCS (0.47%), HCL (0.17%) మరియు రిలయన్స్ (0.08%).
టాప్ లూజర్స్:
బజాజ్ ఫైనాన్స్ (-7.24%), బజాజ్ ఫిన్సర్వ్ (-3.88%), ICICI బ్యాంక్ (-2.21%), టైటాన్ (-2.19%), విప్రో (-1.91%).