ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కేబినెట్ నిర్ణయాలు..
- మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవల వేగం పెంచాలని నిర్ణయం కేబినెట్ నిర్ణయించింది. 2జీ సర్వీసులను 4జీకి మార్చేందుకు రూ.2,426.39 కోట్ల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
- ఈ ఖరీఫ్ సీజన్ లో ఫాస్పేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీని కొనసాగించాలని నిర్ణయించింది.
- 540 మెగావాట్ల క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 4,526.12 కోట్లతో జమ్ము-కశ్మీర్ లోని కిష్త్వార్ వద్ద చీనాబ్ నదిపై ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. 54 నెలల్లో ఈ ప్రాజెక్టు పూర్తికానుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,700 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది.