కేరళలో ప్రశ్నాపత్రానికి బదులు ఆన్సర్ కీ ఇచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కేరళ యూనివర్సిటీ BSc ఎలక్ట్రానిక్స్ నాల్గో సెమిస్టర్ ఫిబ్రవరిలో జరిగింది. అందులో సిగ్నల్ & సిస్టమ్స్ పరీక్షలో ఆన్సర్ కీని పంపిణీ చేశారు. దీనిపై విద్యార్థులు కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. వాల్యుయేషన్‌లో విషయం తేలడంతో ఈ పరీక్షను తిరిగి మే 3న నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. బాధ్యులైన వారిపై చర్యలకు రిజిస్ట్రార్ సిద్ధమయ్యారు.