ఐపిఎల్ లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.నిందితులను బుద్ విహార్ ప్రాంతానికి చెందిన దీపక్ (39), రితాలా ప్రాంతానికి చెందిన తరుణ్ (33), దినేష్ ఖత్రి (24)గా గుర్తించినట్లు వారు తెలిపారు.నిందితుల నుంచి ఐదు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, ఒక ఎల్ఈడీ టెలివిజన్, రూ.1,09,260 నగదు స్వాధీనం చేసుకున్నామని, వారిని రోహిణికి చెందిన విజయ్ విహార్ ప్రాంతంలో పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.