ఏపీ రాష్ట్రంలో నీటి తీరువా వసూళ్ల తీరుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాష్ట్రాన్ని పాలిస్తున్నారా.. వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. గ్రామాల వారీగా టార్గెట్ పెట్టి నీటి పన్నులు వసూలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని కోట్ల రూపాయలు వడ్డీతో సహా రాబట్టాలనుకుంటున్నారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. నెలలు గడిచినా రైతులకు ధాన్యం డబ్బులు చెల్లించలేదని విమర్శించారు.