రైలు కిందపడి ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని అనంతపురం నాల్గవ పట్టణ పోలీసులు కాపాడారు. స్థానిక ఫంగల్ రోడ్డుకు చెందిన ప్రశాంతరెడ్డి ఆర్థిక సమస్యల కారణంగా గురువారం రాంనగర్ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ విషయం డయల్ - 100 కు అందించడం. తద్వారా నాల్గవ పట్టణ సి. ఐ కత్తి శ్రీనివాసుల పర్య వేక్షణలో బ్లూకోల్ట్ హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథరెడ్డి, కానిస్టేబుల్ రఘులు స్పందించి ఆ యువకుడిని వెంటనే కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి ప్రశాంతరెడ్డిని కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.