వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సి ఎస్ పురం మండలంలోని పుల్లగూరపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై చుక్కా శివబసవరాజు కథనం మేరకు గ్రామానికి చెందిన చల్లగాలి మరియమ్మ (37) ఆమె భర్త ఏసోబు తెలంగాణలో బేల్దారి పనిచేస్తుంటాడు. మరియమ్మ వేరే వ్యక్తితో మాట్లాడుతుందన్న విషయం తెలుసుకున్న భర్త ఆమెకు ఫోన్‌చేసి పరాయి వ్యక్తులతో ఎందుకు మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో మనస్థాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.