ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మునగాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Apr 28, 2022, 12:44 PM

మున‌క్కాయల్లో రుచితో పాటు ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోష‌కాలు కూడా ఉంటాయి. అయితే మున‌గాకులో కూడా ఎక్కువ‌గా పోష‌కాలు ఉంటాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మున‌గాకును ఆకు కూర‌గానో, ప‌ప్పులో క‌లెగూర‌గానో లేదంటే ప‌చ్చ‌డిగానో చేసుకుని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలుంటాయని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- మునగాకును ఎక్కువగా వాడటం వల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది.
- జలుబు, దగ్గులాంటి ఇబ్బందుల నుంచి కూడా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
- పాలకూరతో పోలిస్తే మున‌గాకులో 3 రెట్లు ఎక్కువగా ఇనుము ఉంటుంది.
- అరటిపండు కంటే 7 రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది.
- పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. ఈ ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా కాపాడుతాయి.
- మునగాకులో ఎక్కువగా ఉండే పీచువల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అతిగా తిన‌డం అనే స‌మ‌స్య తీరుతుంది.
- మునగాకులోని విటమిన్‌-ఏ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. అమైనో ఆమ్లాలు ప్రొటీన్‌ ఉత్పత్తికి తోడ్పడతాయి. ఈ ప్రొటీన్‌ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
- మున‌గాకులో ఉండే క్లోరోజెనిక్‌ ఆమ్లం కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com