చిత్తూరు జిల్లా పుంగనూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు చిన్నపిల్లల వార్డును రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభోత్సవం చేశారు. గురువారం ఉదయం హెల్త్ సెంటర్ నందు యోగదా సత్సంగ్ సొసైటీ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో పది పడకల చిన్నపిల్లల వార్డును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. వినూత్నంగా రూ. 22 లక్షలతో అధిక సంరక్షణ వసతులతో పది పడకలతో కూడిన చిన్న పిల్లల వార్డును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.