ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేసేందుకు ప్రయత్నిస్తే ట్రాన్సాక్షన్ ఫెయిల్ కావడం చాలా మందికి అనుభవమే. అయితే కొన్ని సార్లు మన అకౌంట్ లో మనీ కట్ అయినా చేతికి మాత్రం డబ్బు రాదు. ఇలాంటి సందర్భంలో ఇలా చేయడం ద్వారా అకౌంట్ నుండి కట్ అయిన డబ్బు తిరిగి పొందవచ్చు. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినప్పుడు వచ్చే స్లిప్ ను జాగ్రత్తగా దాచుకోండి. అందులోని ఐడీని రెఫరెన్స్ గా చూపుతూ బ్యాంకు కస్టమర్ కేర్ కు, మరో కంప్లైంట్ రాసి ఏటీఎం సెంటర్‌లో అందుబాటులో ఉన్న డ్రాప్ బాక్సులో వేయండి. బ్యాంకు అఫిషియల్ ఈ మెయిల్ ఐడీ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం 7 పని దినాల్లో కస్టమర్ ఖాతాలో డబ్బు జమ చేయాలి. అలా కాకుంటే రోజుకు రూ.100 చొప్పున పరిహారం చెల్లిస్తారు. వారం గడిచినా డబ్బు అందకుంటే బ్యాంక్ బ్రాంచ్ కు వెళ్లి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ ట్రాకింగ్ నెంబర్ నోట్ చేసుకోవడం మరిచిపోకండి. బ్రాంచ్ లో బ్యాంక్ అధికారులు మీకు సహాయం అందిస్తారు.