తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని మామండూరు వద్ద పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిలో చిత్తూరు నుండి తిరుపతి వైపు కారు వేగంగా వస్తుంది. ఈక్రమంలో చంద్రగిరి మండలం, మామండూరుకు చెందిన లక్ష్మమ్మ(45) మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తుంది.
ఉదయం ఉపాధి హామీ పథకంలో కూలీ పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, జాతీయ రహదారి దాటుతుండగా కారు ఢీ కొంది. ప్రమాదంలో లక్ష్మమ్మకు తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.