ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి గురువారం సాయంత్రం కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి తన కుమారుడు మేకపాటి విక్రమ్‌రెడ్డితో వెంటబెట్టుకుని రాజమోహన్‌రెడ్డి సీఎం జగన్‌ను కలిశారు.జగనన్న కేబినెట్లో మంత్రిగా కొనసాగిన మేకపాటి గౌతంరెడ్డి ఇటీవల గుండెపోటుతో మరణించారు. గౌతంరెడ్డి మృతితో నెల్లూరు జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.