ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. 30వ తేదీన జ్యుడీషియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సదస్సుకు కూడా జగన్ హాజరుకానున్నారు.ఈ సమావేశానికి ప్రధానమంత్రి, సీజేఐ, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు.దేశంలో న్యాయపరమైన మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై సెమినార్ నిర్వహించనున్నారు.