ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం సాయంత్రం జరిగిన రెండు పేలుళ్లలో కనీసం తొమ్మిది మంది మరణించగా, మరో 13 మంది గాయపడ్డారు. బాల్ఖ్ ప్రావిన్స్‌లోని మజార్-ఎ-షరీఫ్ ప్రాంతంలో పేలుళ్లు సంభవించాయి. రెండు పేలుళ్లు ప్రజా రవాణాను లక్ష్యంగా చేసుకున్నాయి.గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నట్లు ప్రాంతీయ ఆరోగ్య అధికారులు ధృవీకరించారు.కాగా, పేలుళ్లకు బాధ్యత వహిస్తున్నట్లు ఏ గ్రూపు ప్రకటించలేదు.