ప్రతిరోజు పెరుగు తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు బాగుంటుంది. పెరుగును క్రమం తప్పకుండా తింటే పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. పెరుగులో శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రతిరోజూ పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి.పెరుగులో క్యాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు, దంతాలకు మేలు చేస్తుంది. పెరుగులో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఇది క్యాల్షియంతో కలవడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోజూ పెరుగు తింటే భవిష్యత్తులో కీళ్లనొప్పులు, ఆస్టియోపొరోసిస్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ప్రతిరోజూ పెరుగు తీసుకుంటే అధిక రక్తపోటు అదుపులోకి వస్తుంది.