ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 29, 2022, 11:55 AM

ఏపీ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్లను తీసుకెళ్లటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షా కేంద్రం ప్రాంగణం వెలుపలే డిపాజిట్ చేసుకోవాలని సూచిస్తూ ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్ధులు, ఎగ్జామినర్లు ఎవరూ మొబైల్​ ఫోన్లు తీసుకెళ్లొద్దని కమిషనర్ స్పష్టం చేశారు. పరీక్షల విధులతో సంబంధం లేని సిబ్బందిని ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్రాలకు అనుమతించొద్దని డీఈవోలను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com