ఓ వ్యక్తి 84 ఏళ్లుగా ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. దీంతో ఆయనకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. అత్యధిక కాలం ఒకే కంపెనీలో పని చేసినందుకు గానూ ఆయనకు గిన్నిస్ రికార్డ్స్‌లో చోటు లభించింది. ఆయన పేరు వాల్టర్ ఓర్త్‌మాన్. ఆయన ఇటీవలే తన 100వ పుట్టిన రోజును జరుపుకున్నారు.
బ్రెజిల్ కు చెందిన వాల్టర్ బ్రస్క్‌లోని రెనాక్స్ ఎస్.ఏ అనే టెక్స్టైల్ కంపెనీలో పని చేస్తున్నారు. 1938, జనవరి 17 నుంచి ఆయన ఆ కంపెనీలో పని చేస్తున్నారు. ఈ సంస్థలో చేరినప్పుడు ఆయన వయసు 15 ఏళ్లు. షిప్పింగ్ డిపార్ట్మెంట్ లో వాల్టర్ అసిస్టెంట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సేల్స్ మేనేజర్ ఇలా పలు పదవుల్లో పని చేశారు. ఏప్రిల్ 19న వాల్టర్ 100వ పుట్టిన రోజు జరుపుకున్నారు. అయినా ఆయన రిటైర్ అవ్వాలని అనుకోవడం లేదట. పని చేయడానికి ఇష్టపడాలి, అందుకే నేను అదే స్ఫూర్తితో ఇన్ని దశాబ్దాలుగా పని చేస్తున్నానని వాల్టర్ చెప్పుకొచ్చారు.