పిచ్చాటూరు ఆరణియర్, కైలాసనాథ కోన లో రూ. 1. 50 కోట్ల టూరిజం పనులకు టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని తుడా వీసీ హరికృష్ణను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే తిరుపతిలోని తుడా కార్యాలయానికి చేరుకొని వైస్ చైర్మన్ హరికృష్ణను కలుసుకున్నారు.
నియోజకవర్గంలో మంజూరైన నిధులతో టూరిజం పనులకు టెండర్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే వరదయ్యపాలెం లో తుడా నిధులు రూ. 50 లక్షలతో చేపట్టనున్న డ్రైన్ పనుల తాజా పరిస్థితిని తుడా విసి హరికృష్ణ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు.
తన వినతుల పై తుడా వీసీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. అంతకుముందు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చేరుకొని వైస్ చాన్సలర్ రాజారెడ్డిని కలుసుకుని నియోజకవర్గంలోని విద్యార్థులకు సంబంధించిన పలు సమస్యలపై ఎమ్మెల్యే చర్చించారు.