కాసేపట్లో వివాహం జరగాల్సి ఉండగా వధువు హత్యకు గురైన ఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. మథుర నౌజీల్లోని ముబారిక్పుర్ గ్రామంలో గురువారం రాత్రి పెళ్లి కూతురును గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపాడు. పెళ్లిదండలు మార్చుకుని వధువు గదిలోకి వెళ్లగానే కాల్పులు జరిగాయి. లోపలికి వెళ్లి చూసిన తల్లిదండ్రులకు తమ కూతురు రక్తపుమడుగులో శవమై కన్పించింది.
ఈ దారుణానికి పాల్పడింది ఎవరో తమకు తెలియదని కుటుంబ సభ్యులు చెప్పారు. పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. వధువు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రూరల్ ఎస్పీ శిరీష్ చంద్ర తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.