డ్రాగన్ ఫ్రూట్.. ఈ పండు ఇటీవల ఇండియన్ మార్కెట్‌లో బాగా ఫేమస్ అవుతోంది. ఎక్కడో విదేశాల్లో పండే ఈ పండును ఇప్పుడు మన దేశంలోనూ పండిస్తున్నారు. అయితే ఆరోగ్యం మెరుగుపడాలంటే రకరకాల పండ్లను తినాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కొంచెం పుల్లగా మరియు కొద్దిగా తీపిగా ఉండే ఈ డ్రాగన్ ఫ్రూట్స్‌లో ఆరోగ్యాన్ని పెంపొందించే ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్, ఐరన్, ప్రొటీన్, కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్స్ మరియు పాలీఫెనాల్స్ వంటి విలువైన పోషకాలను కలిగి ఉంటుంది.
రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఈ పండులో ఉంది. వివిధ వ్యాధుల నుండి రక్షిస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసే సహజ యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయి. జీర్ణవ్యవస్థకు మంచిది. ఈ పండు కాస్త ఖరీదైనది. ఒక్కో పండు మార్కెట్ లో రూ.70 నుంచి రూ.100 వరకు దొరుకుతుంది.