ష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య వ్యత్యాసాలు, వ్యసనాలు పెరిగి మాటలతో యుద్ధాలు చేసుకుంటున్నారు. స్థానిక పార్టీలు ఐన వైసీపీ మరియు టీడీపీ ల మధ్య రోజురోజుకి మాటలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నగరి ఎమ్మెల్యే , పర్యాటక మంత్రి రోజా లోకేష్ మీద ఘాటు వ్యాఖ్యలు చేసారు. ఒకానొక సందర్భంలో నారా లోకేష్ ని ఎలెక్షన్స్ లో గెలిపించుకోలేక పోయిన క్నాద్రబాబు కి చీరలు పంపిస్తా అని అన్నారు. పచ్చ చీర కావాలా లేక పసుపు చీర కావాలా అని అన్నారు. ఈ తరుణంలో ఎంతో మంది టీడీపీ నాయకులూ కూడా రోజా మీద వ్యాఖ్యలు చేసారు. ఐతే , నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులూ ఆనం వెంకట రమణ రెడ్డి మాత్రం కొంచెం శృతి మించి వ్యాఖ్యానించారు అని చర్చలు జరుగుతున్నాయి. లోకేష్ ఓటమి కారణంగా చీరలు ఇస్తా అన్నావ్ కధ రోజా అక్క, మరి సీఎం జగన్ అమ్మగారు విజయమ్మ వైజాగ్ లో ఓడిపోయింది కదా..! మరి మీకు మేము ఏమి ఇవ్వాలి అని అన్నారు. ఇంతటితో ఆగకుండా మాకు చీరలు పెడితే , మేము మీకు బ్రాలు, కట్ డ్రాయర్లు ఇస్తాము అని వ్యంగంగా మాట్లాడారు. ఇప్పుడు రాష్ట్రంలో ఇదే విషయం మీద చర్చ నడుస్తున్నట్లు సమాచారం. మంత్రి పదవి వచ్చింది కాబట్టి ప్రజలకి దీనిని ఉపయోగించుకొని మీకు అవకాశం ఉన్నంతవరకు మేలు చెయ్యడానికి ప్రయత్నించండి కానీ, ప్రజలను రెచ్చ గొట్టే విధంగా మాట్లాడకండి అని ఆయన , రోజాకి హితవు పలికారు.