హైకోర్టుల్లో జడ్జీల నియామకానికి పేర్లను సూచించాలని సీజేఐ జస్టిస్ రమణ హైకోర్టు సీజేలను కోరారు. ఏడాదిలో 126 ఖాళీలను భర్తీ చేశామని, త్వరలో మరో 50 నియామకాలు జరుగుతాయని చెప్పారు. సుప్రీంకోర్టు ఆవరణలో హైకోర్టు CJల 39వ సదస్సును ఆయన నిర్వహించారు. న్యాయవ్యవస్థలో సంస్థాగత, చట్టపరమైన సంస్కరణల అమలుపై చర్చించారు. హైకోర్టు జడ్జీల వేతనాలు, రిటైర్మెంట్ తర్వాత ప్రయోజనాలను పెంచడం వంటి అంశాలపై సమాలోచనలు జరిపారు.