ఏపీ గురించి మంత్రి కేటీఆర్ వాస్తవాలే మాట్లాడారని మరో మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. 'ఏపీని అభివృద్ధి చేస్తే మేం ఏమైనా అడ్డుపడుతున్నామా? విజయవాడ నుంచి రియల్ఎస్టేట్ వ్యాపారులు హైదరాబాద్ వస్తున్నారు. దానికి మేం ఏం చేస్తాం?' అని ప్రశాంత్ రెడ్డి అన్నారు. అటు వైసీపీ ఎంపీలు కేసీఆర్‌కు ఫ్యాన్స్ అని.. ఈ విషయాన్ని చాలామంది ఎంపీలు చెప్పారని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.