బీహార్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.12 తొలి కేసు నమోదైంది. ఇది ఒమిక్రాన్ (BA.2)కన్నా పదిరెట్లు ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు వేగంగా జనాలకు సోకుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకిన ఓ వ్యక్తి శాంపిల్‌కు పాట్నాలోని IGIMSలో జన్యు క్రమ విశ్లేషణ చేయగా BA.12 పాజిటివ్‌గా వెల్లడైందని అధికారులు ప్రకటించారు.