ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ రైతు టచ్ పద్దతిలో 23 అడుగుల కంటే ఎక్కువ పొడవైన చెరకును ఉత్పత్తి చేసి రికార్డు నెలకొల్పాడు. మొరాదాబాద్ జిల్లాను అక్కడి ప్రజలు ఎక్కువ మంది చెరకు బెల్ట్ అని పిలుస్తుంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు చెరుకునే సాగు చేస్తూ వస్తున్నారు. ఈ జిల్లాలోనే బిలారి ప్రాంతంలో నివశిస్తున్న మహ్మద్ ముబీన్ అనే రైతు టచ్ పద్ధతిలో 23 అడుగుల కంటే ఎక్కువ పొడవైన చెరుకును పండించి రికార్డు నెలకొల్పాడు.
ఈ రైతు సాగు చేసిన చెరుకు పంటను చూసేందుకు మొరాదాబాద్ మండల రైతులు మహ్మద్ ముబీన్ పొలానికి క్యూ కడుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు 23 అడుగుల గోధుమలను కూడా పండిస్తున్నారు. సాధారణంగా చూస్తే ఒక బీగా పొలంలో 40-50 క్వింటాళ్ల చెరుకు మాత్రమే దిగుబడి అయ్యేది. కానీ మహ్మద్ మోబిన్ టచ్ పద్ధతిలో సాగు చేయడం వల్ల ఒక బీగా పొలంలోనే 100 క్వింటాళ్లకు పైగా పంట రాబడి వచ్చింది. దీంతో ఆ రైతును పలువురు ఆదర్శంగా తీసుకుని చెరుకు సాగు చేస్తున్నారు.