ఉక్రెయిన్లోని ప్రధాన నగరాలపై దాడులు చేస్తోన్న రష్యా సైనికులు అక్కడ ప్రజలు నిల్వ చేసుకున్న గోధుమలను దోచుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. కామియాంకాలో 60 టన్నుల గోధుమలను ట్రక్కులతో సహా ఎత్తుకెళ్లారని అధికారులు చెప్పారు. మెలిటోపోల్లోనూ 50 కార్లకు ట్రాలెర్లను ఏర్పాటుచేసి ధాన్యాలను తరలించినట్లు ఆ నగర మేయర్ చెప్పారు. గోధుమ, మొక్కజొన్న పంటలకు ప్రసిద్ధి అయిన ఉక్రెయిన్ను బ్రెడ్బాస్కెట్గా పిలుస్తారు.