గుంటూరు రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. 'స్వాతంత్ర్య దినోత్సవం రోజున పట్టపగలు అందరూ చూస్తుండగా హత్య చేశాడు. ఇంత చేసినా నిందితుడిలో మార్పు రాలేదు. విచారణ సమయంలో కోర్టు నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. మాటల్లో, వ్యవహారశైలిలో మార్పు రాలేదు. తప్పు చేశాననే బాధ లేదు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని కఠినమైన శిక్ష విధిస్తున్నాం' అని జడ్జి అన్నారు.