గుంటూరుకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో నిందితుడు శశికృష్ణను కోర్టు దోషిగా తేల్చడంపై బాధితురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 'పోలీసులు, న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు. ఉరిశిక్ష వేసినందుకు న్యాయం జరిగిందని భావిస్తున్నాం. మరికొందరికి ఇలాంటి శిక్ష పడితేనే నేరాలు ఆగుతాయి' అని రమ్య కుటుంబ సభ్యులు తెలిపారు.