మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఆర్కే రోజా కుటుంబంతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ప్రగతిభవన్‌కు చేరుకున్న ఆమెకు సీఎం భార్య శోభ, ఎమ్మెల్సీ కవిత స్వాగతం పలికారు. కేసీఆర్ పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయనతో పలు అంశాలపై చర్చించారు. బయటకు రాగానే ఏపీపై కేటీఆర్ వ్యాఖ్యలను విలేకరులు ప్రశ్నించగా, ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.